Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

‘ఒక్కడు’, ‘పోకిరి’ సినిమాల స్ఫూర్తితోనే ‘గేమ్ ఛేంజర్’ తీశానని దర్శకుడు శంకర్ ఆ సినిమా ప్రమోషన్స్ లో చెప్పడం జరిగింది. తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఎలాంటి చేదు ఫలితాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. హీరో రామ్ చరణ్(Ram Charan) కెరీర్లో అదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.అందులో అప్పన్న పాత్ర మినహా మరేదీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా నిర్మాత దిల్ రాజుకు అది భారీ నష్టాలను మిగిల్చింది.

Ram Charan

ఇప్పుడు ఇదే కోవలో ‘హనుమాన్’ నిర్మాత చైతన్య రెడ్డి సైతం.. రామ్ చరణ్‌తో ‘ఇంద్ర’ లాంటి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నారట.ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా పూర్తవగానే, ఈ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచనున్నారని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే, ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఒకటుంది. స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడానికి పాత బ్లాక్‌బస్టర్ సినిమాల రిఫరెన్సులు చెబితే సరిపోతుందా? లేక దర్శకనిర్మాతలు ఇంకా పాత మూసలోనే ఉండిపోతున్నారా? లేదంటే అలా చెబితేనే స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడానికి ముందుకొస్తారా? అనే సందేహాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మారిన ప్రేక్షకుల అభిరుచిని, ప్రస్తుత ట్రెండ్‌ను అర్ధం చేసుకుని చైతన్య రెడ్డి లాంటి అప్‌కమింగ్ నిర్మాతలు ముందడుగు వేయాలి. కానీ మూసపద్ధతిలో పాత హిట్ల పేర్లు వాడితే.. వాళ్లకి స్టార్ హీరోతో సినిమా ఓకే అవుతుందేమో కానీ, నేటి ఆడియన్స్ అలాంటి సినిమాలని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు కదా. పైగా ఎక్కువగా ట్రోలింగ్ పాలయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి..! కాబట్టి నిర్మాతలూ ఇలాంటి ఆలోచనలు మార్చుకోవాలి, హీరోలు కూడా అలాంటి వ్యామోహల బారిన పడకూడదు.!

మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus