మహేష్ డ్రెస్సింగ్ స్టైల్ వెనుక రీజన్ ఏమిటో..!

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్స్ లో తీరిక లేకుండా పాల్గొంటున్నారు. చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా, బలమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అత్యధిక వసూళ్లు సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిన్న హన్మకొండలో అభిమానుల సమక్షంలో భారీగా విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా షేర్ సాధించినట్లు ప్రకటించేసుకున్నారు. ఐతే ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మహేష్ లో కామన్ పాయింట్ ఒకటి కనిపిస్తుంది.

వివిధ టీవీ కార్యక్రమాలు, పాత్రికేయుల ఇంటర్వ్యూలో పాల్గొంటున్న మహేష్ సింగిల్ కలర్ ప్లైన్ టీ షర్ట్స్ ధరించి కనిపిస్తున్నారు.ఆరంజ్, పింక్, బ్లూ, ఎల్లో, బ్లాక్ ఇలా అనేక సింగిల్ కలర్ ప్లైన్ టీ షర్ట్స్ లో మహేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు.మరి ఆయన అలా ప్లైన్ టీ షర్ట్స్ వేసుకోవడం వెనుక ఏదైనా సెంటిమెంట్ ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనేది అర్థం కావడం లేదు. అలాగే ది హంబుల్ కో అనే ఓ గార్మెంట్ బ్రాండ్ నీ మహేష్ సొంతగా నడుపుతున్నారు. ఆ బ్రాండ్ కి సంబందించిన ఉత్పత్తులను మహేష్ ఇలా పనిలో పనిగా ప్రచారం చేసుకుంటున్నాడా అని కూడా అనుమానం కలుగుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus