స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కేజీఎఫ్2 సినిమాను మించి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కే టీమ్ కు పార్టీ ఇచ్చారని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభాస్ ఇచ్చిన పార్టీకు అమితాబ్, రాఘవేంద్ర రావు, దుల్కర్ సల్మాన్, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాజెక్ట్ కే షెడ్యూల్ తాజాగా పూర్తి కావడంతో పాటు ప్రభాస్ ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ రీజన్ వల్లే ప్రభాస్ పార్టీ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తుండగా అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 79 సంవత్సరాల వయస్సులో కూడా అమితాబ్ బచ్చన్ యాక్టివ్ గా ఉండటంతో పాటు సినిమా షూటింగ్ లలో పాల్గొంటుండటం గమనార్హం. ప్రాజెక్ట్ కే సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.