Vishwak Sen: విశ్వక్ సేన్ పేరు మార్చుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

  • June 4, 2023 / 11:53 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రస్తుతం ఈ హీరో గామి అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. గామి సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని విశ్వక్ సేన్ నమ్మకంతో ఉన్నారు. అయితే విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు కావడం గమనార్హం. కెరీర్ తొలినాళ్లలో న్యూమరాలజిస్ట్ సూచనల మేరకు విశ్వక్ సేన్ పేరు మార్చుకున్నారు.

పేరు మారడంతో (Vishwak Sen) విశ్వక్ సేన్ కు లక్ కూడా కలిసొచ్చింది. యూత్ కు నచ్చే సినిమాలు చేయడం విశ్వక్ సేన్ కు కెరీర్ పరంగా ప్లస్ అయింది. ఫలక్ నుమా దాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ సినిమాలతో విశ్వక్ సేన్ కు బ్యాక్ టు బ్యాక్ విజయాలు దక్కాయి. ఒక సందర్భంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన పేరుకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

పేరు మార్చుకుని వెళ్లిపోమాకే మూవీ రిలీజైన మూడు రోజుల తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా కోసం అడిషన్స్ కు పిలుపు వచ్చిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. నా పేరు మారిన తర్వాత నా జీవితంలో మార్పులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. పేరు మార్చుకున్నాక జీవితంలో మార్పులు రావడంతో ఇదే పేరును కొనసాగించానని విశ్వక్ సేన్ కామెంట్లు చేయడం గమనార్హం.

నెవ్వర్ గివ్ అప్ ఆటిట్యూడ్ తో జీవనం సాగించాలని ఆయన అన్నారు. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఉందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ కు రాబోయే రోజుల్లో వరుస విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో విశ్వక్ సేన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో విశ్వక్ సేన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus