అప్పుడు ‘బాహుబలి’.. ఇప్పుడు ‘సాహూ’ తో ఎస్కేప్ అవుతున్న కృష్ణంరాజు..!

  • January 21, 2019 / 01:05 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహూ’ చిత్రం చేస్తూనే ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కావడంతో ప్రభాస్ పెళ్ళి ఇప్పుడా అని తన అభిమానులతో పాటూ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఈ విషయం పై ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణంరాజు స్పందించారు.

తాజాగా కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలో భాగంగా… ఓ దినపత్రికకు ప్రత్యేకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు. కృష్ణంరాజు మాట్లాడుతూ… “నన్ను ప్రభాస్ పెళ్ళి గురించి చాలా మంది అడుగుతున్నారు… ‘సాహూ’ సినిమా విడుదల కాగానే ఆ వేడుక ఉంటుంది… ” అంటూ రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలిపారు. అయితే గతంలో కూడా ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ వివాహం ఉంటుందని పలు సందర్భాల్లో కృష్ణంరాజు చెప్పి ఎస్కేప్ అయ్యారని ఇప్పుడు మళ్ళీ ‘సాహూ’ చిత్రాన్ని అడ్డుపెట్టుకుని ఎస్కేప్ అవుతున్నారని.. కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక దీనితో పాటు కృష్ణంరాజు పలు విషయాల్ని ముచ్చటించారు… ” ‘బాహుబలి’ తరువాత తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. నేను 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను, అప్పట్లో హీరోల మధ్య ఎటువంటి సత్సంబంధాలుండేవో… ఇప్పుడు కూడా మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ల మధ్య అలాంటి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో లవ్ స్టోరీ నిర్మిస్తున్నాను, అందులో కూడా నేను ఓ కీలక పాత్రను పోషిస్తున్నాను. ఇటీవల నేను చుసిన సినిమాల్లో ‘మహానటి’ అద్భుతంగాది. నాకు ఎస్వీ రంగారావు బయోపిక్ ను చూడాలని ఉంది, ఈ పాత్ర ప్రకాశ్ రాజ్ చేస్తే చాలా బాగుంటుంది”…. అంటూ తన అభిప్రాయాల్ని తెలియజేసారు కృష్ణంరాజు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus