Akhanda Movie: ఫ్యాన్స్ కు శుభవార్త.. అఖండ రిలీజ్ అప్పుడే..?

క్రిష్ డైరెక్షన్ లో 2017 సంవత్సరంలో తెరకెక్కి విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరువాత బాలకృష్ణ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ డేట్ మార్చుకున్న అఖండ సినిమా ఆఖరి షెడ్యూల్ జులై తొలి వారం నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. చివరి షెడ్యూల్ లో భాగంగా యాక్షన్ సీన్స్ తో పాటు ఒక పాటను తెరకెక్కించనున్నారని సమాచారం. బాలయ్యకు విలన్ గా శ్రీకాంత్ ఈ సినిమాలో నటిస్తుండగా శ్రీకాంత్ గెటప్ తో పాటు పాత్ర చిత్రణ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఖండ మూవీ భారీ బడ్జెట్ మూవీ కావడంతో బాలయ్య సోలోగానే బరిలోకి దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. అఖండ మూవీ రిలీజ్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానని ప్రగ్యా జైస్వాల్ భావిస్తున్నారు. బాలయ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా హిట్టైతే మాత్రమే బోయపాటి శ్రీనుకు టాలీవుడ్ టాప్ హీరోలు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus