పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) ఎట్టకేలకు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా, తాజాగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అసలైతే మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నా, పవన్ రాజకీయ కమిట్మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికీ 20 రోజుల షూటింగ్ మిగిలి ఉండటంతో, ఏఎమ్ జ్యోతి కృష్ణ (Jyothi Krishna ) ఆ పార్ట్‌ను పూర్తి చేయనున్నాడు.
ఇదిలా ఉంటే, వీరమల్లు రిలీజ్ అయ్యాక కేవలం నాలుగు నుంచి ఆరు నెలల్లో పవన్ మరో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG (OG Movie) మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా పవన్ మాస్ ఇమేజ్‌ను ఉద్ధరించేలా ఉంటుందని, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. మే 9న హరి హర వీర మల్లు రాగా, OGని సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
పవన్ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా, OG షూటింగ్‌ను అతనికి అనుకూలంగా ప్లాన్ చేశారు. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేసి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇది పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావడంతో, ఫ్యాన్స్‌కి పక్కా మాస్ ఫీస్ట్ అందించనున్నారట. ఇక హరి హర వీర మల్లు విషయానికి వస్తే, ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ (Bobby Deol) విలన్‌గా నటిస్తుండగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా కనిపించనుంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండటంతో, ఆల్బమ్ కూడా హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పవన్ బాక్సాఫీస్‌ను ఊపేయాలని చూస్తున్నాడు. మేలో హరి హర వీర మల్లు, ఆ తర్వాత సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో OG రావడంతో పవర్ స్టార్ బాక్సాఫీస్‌పై ఏ రేంజ్‌లో ప్రభావం చూపుతాడో చూడాలి.