ఈ ఏడాది టాలీవుడ్లో వచ్చిన 10 రీమేక్ సినిమాలు.. అందులో హిట్లు ఎన్ని.. ప్లాపులెన్ని?

ప్రతి ఏడాది రీమేక్ సినిమాలు వస్తూనే ఉంటాయి. రీమేక్ అనగానే ఓ హిట్ సినిమాని ఇంకో భాషలోకి రీమేక్ చేయడం అని అంతా అనుకుంటారు. నిజమే కానీ హిట్టు సినిమాని రీమేక్ చేసినంత మాత్రాన సక్సెస్ దక్కుతుంది అనుకోవడం తప్పు. రాష్ట్రానికో భాష. భాషకి తగ్గ భావం ఎలా అయితే వేరుగా ఉంటుందో.. వివిధ రాష్ట్రాల్లో ఉండే జనాలకు అభిరుచులు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి నేటివిటీని అర్థం చేసుకుని రీమేక్ లు చేయాలి. పైగా ఈ ఏడాది సినీ పరిశ్రమకు ఆడియన్స్ పెద్ద గుణపాఠం నేర్పారు. ఓటీటీల్లో వారికి మంచి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ దొరుకుతుంది. అందులోనూ పక్కన భాషల్లోని సినిమాలను కూడా జనాలు ఫ్రీగా, కంఫర్ట్ గా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు రీమేక్ సినిమాల కోసం థియేటర్లకు ఎలా వస్తారు? అందుకే ఈ ఏడాది రీమేక్ అయిన సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి ఈ ఏడాది రీమేక్ అయిన సినిమాలు ఏంటో? అవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి రీమేక్ గా తెరకెక్కింది. సినిమాకి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులు చేసినప్పటికీ.. సినిమాకి హిట్ టాక్ వచ్చినప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యే సినిమా ఇది కాదు అంటూ కామన్ ఆడియన్స్ పెదవి విరిచారు.

2) శేఖర్ :

రాజశేఖర్ హీరోగా రూపొందిన ఈ మూవీ మలయాళంలో రూపొందిన ‘జోసెఫ్’ కు రీమేక్. ఈ సినిమాకి కూడా పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫెయిల్ అయ్యింది. పెద్ద ప్లాప్ గా మిగిలింది.

3) గాడ్ సే :

సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీ ‘ది నెగోషియేషన్’ అనే కొరియన్ మూవీకి రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.

4) శాకిని డాకిని :

నివేదా థామస్, రెజీనా లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ.. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా కూడా పెద్ద ప్లాప్ గా మిగిలింది.

5) దొంగలున్నారు జాగ్రత్త :

సింహ కోడూరి, సముద్ర ఖని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ‘4*4’ అనే స్పానిష్ మూవీ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా కూడా పెద్ద ప్లాప్ అయ్యింది.

6) గాడ్ ఫాదర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళం మూవీ ‘లూసిఫర్’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

7) ఉర్వశివో రాక్షసివే :

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ మూవీ ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

8) గుర్తుందా శీతాకాలం :

సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ‘లవ్ మాక్టైల్’ అనే కన్నడ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ కూడా పెద్ద ప్లాప్ గా మిగిలింది.

9) ఓరి దేవుడా :

విశ్వక్ సేన్ – వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’ కి రీమేక్. తెలుగులో ఈ సినిమా అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

10) అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి :

అలీ, నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ మలయాళం మూవీ వికృతికి రీమేక్ గా తెరకెక్కింది. నేరుగా ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ సినిమా ఫలితం ఏంటో ఎవ్వరికీ తెలీదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus