బద్రి సినిమాతో రేణు దేశాయ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత జానీలోను కనిపించింది. పవన్ కళ్యాణ్ తో సహజీవనం మొదలు పెట్టడంతో అతని చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసింది. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే రేణు దేశాయ్ ని నటించమని చాలామంది కోరారు. కానీ సున్నితంగా తిరస్కరించింది. ఓ డ్యాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించింది. ఇప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.
పిల్లలే తన లోకంగా బతికిన ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైంది. సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తితో నడవడానికి అంగీకరించింది. నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి. ఈ విషయంపై పవన్ అభిమానులకు, ఆమెకు ఓ మినీ యుద్ధమే జరిగింది. అయినా రేణు తట్టుకొని నిలబడింది. ఇప్పుడు రెండో నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది. అదే సినిమాల్లో మళ్ళీ నటించడం. ఈ మధ్య ఆమె ఓ సినిమాకి సైన్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. పెళ్లి తర్వాత షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.. రేణు దేశాయ్ స్పందిస్తేనే తెలుస్తుంది.