Republic Teaser: ”వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే”

మెగాహీరో సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రిపబ్లిక్’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా ఎలా వుండబోతుందనే దానిపై హింట్ ఇచ్చారు. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. ”ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం.. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే.. ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యుడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం” అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

”ప్రజలే కాదు.. సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బ్రతుకుతున్నారు” అంటూ కోర్టులో హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ”వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే సార్” అని వినిపించిన డైలాగ్ ప్రస్తుత ప్రభుత్వ తీరుని ప్రశ్నించేలా ఉంది. టీజర్ మొత్తం ఎలెక్షన్స్, గొడవల నేపథ్యంలో సాగింది. రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్ ఫుల్ గా చూపించడానికి ప్రయత్నించారు. టీజర్ ని బట్టి పూర్తి స్థాయి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సీరియస్ సినిమాగా అనిపిస్తోంది.

జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus