Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని ప్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. ‘కంగువా’ తో కంగుతున్న సూర్య ‘రెట్రో'(Retro) తో మరో డిజాస్టర్ ను మూటగట్టుకున్నట్టు అయ్యింది. 2025 మే 1న విడుదలైన ఈ సినిమాకి  కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాడు. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కూడా నిరాశపరిచింది.

Retro Collections

వీకెండ్ వరకు ఓ మోస్తరు కలెక్షన్స్ ను సాధించిన ఈ సినిమా.. తర్వాత బాగా డౌన్ అయ్యింది. ఆ తర్వాత కోలుకుంది లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.38 cr
సీడెడ్ 0.44 cr
ఉత్తరాంధ్ర 0.50 cr
ఈస్ట్ 0.22 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.34 cr
కృష్ణా 0.32 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 3.53 cr

‘రెట్రో’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.3.53 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.9 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.4.47 కోట్లు షేర్ దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది. నాని ‘హిట్ 3’ పోటీగా రిలీజ్ అవ్వడం.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వల్ల ‘రెట్రో’ నిలబడలేక చతికిలపడింది.

‘ఆరంభిద్దామా’.. ఎట్టకేలకు తలైవాకి డైరక్టర్‌ ఫిక్స్‌… ఎవరంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus