RGV Deyyam: ‘ఆర్జీవీ దెయ్యం’ బిజినెస్ అండ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ డీటెయిల్స్..!

‘నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్’, ‘పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి’ బ్యానర్ల పై జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. రాంగోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. 6 ఏళ్ళ క్రితం ‘పట్ట పగలు’ పేరుతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. కానీ ‘ఆర్జీవీ దెయ్యం’ గా టైటిల్ మార్చి … ఏప్రిల్ 16న సినిమాని విడుదల చేశారు. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి అగ్ర నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీతో కలిపి 5 భాషల్లో విడుదల చేశారు.

కానీ తొలి రోజే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం.. అలాగే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఉండడంతో జనాలు ఈ చిత్రాన్ని చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక బిజినెస్ విషయానికి వస్తే.. అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు.థియేట్రికల్స్ పరంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.50 లక్షల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని భాషల్లోనూ కలిపి కేవలం రూ.9 లక్షల షేర్ ను రాబట్టింది.

కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమనే చెప్పాలి. అయితే వర్మ ఈ చిత్రాన్ని రూ.2 కోట్ల( ప్రింట్ అండ్ పబ్లిసిటీ కాస్ట్ లతో కలిపి) బడ్జెట్ లోపే ఫినిష్ చేసాడట. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.3.5 కోట్ల వరకూ వచ్చినట్టు తెలుస్తుంది. సో నిర్మాతలు సేఫ్ అన్న మాట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus