దిశ ఘటన మరువక ముందే.. వైరల్ అవుతోన్న వర్మ ట్వీట్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. వివాదాస్పదమైన అంశాలను ఎన్నుకుంటూ సినిమాలు తీస్తూ తన ప్రత్యేకతను చాటుతుంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వర్మ ఏం చేసినా అది సంచలనమవుతూనే ఉంటుంది.

తాజాగా ఈ దర్శకుడు తన ట్విట్టర్ అకౌట్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఓ మహిళ పంజాగుట్టా పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయంకరమైన సంఘటన గురించి తెలుసుకొని హృదయం ద్రవించిందని ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇలాంటి వాటికి కఠినమైన సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. తన అభిప్రాయాన్ని తెలియజేశారు. వర్మ ఇలాంటి పోస్ట్ పెట్టడంపై కొందరు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాలను కూడా వర్మ అర్ధం చేసుకోగలరా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల వర్మ తీసిన బ్యూటీఫుల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus