పీహెచ్డీ సబ్జెక్టు గా రామ్ గోపాల్ వర్మ జీవితం

  • November 5, 2016 / 06:04 AM IST

పురుషలందు పుణ్య పురుషులు వేరయ్యా.. అన్నట్టు దర్శకులు లందు రామ్ గోపాల్ వర్మ వేరయ్యా అని చిత్రపరిశ్రమ ఎప్పుడో డిసైడ్ చేసింది. ఇప్పుడు అందుకు ధ్రువీకరణ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రవీణ్ యజ్జల అనే విద్యార్థి తన పీహెచ్డీ  సబ్జెక్టు గా రామ్ గోపాల్ వర్మను తీసుకున్నారు. ఆయనపై “రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వం, సినిమాలు – మనో పరిశీలన”  అనే పరిశోధన ప్రణాళికను రచించారు. పీహెచ్డీ కోసం ఈ పరిశోధన గ్రంథాన్ని విశాఖపట్నం లోని వర్సిటీలో నిన్న సమర్పించారు.

ఈ సంగతి తెలిసి వర్మ ఆశ్చర్యపోయారు. “పీహెచ్దీ స్టడీ కి నేను సబ్జెక్టుగా పనికొచ్చానా ? నా కూతురు నన్ను జూ లో పెట్టాలని అంటూ ఉంటుంది. ఇప్పుడు నాపై థీసిస్ రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది” అని ట్విట్టర్లో వెల్లడించారు. “నేనంటే ప్రవీణ్ కి ఉన్న పిచ్చి నన్ను పిచ్చివాణ్ణి చేసింది” అని ఆనందం వ్యక్తం చేసారు. వర్మపై ఉన్న క్రేజ్ కి ఇది ఒక నిదర్శనమని అయన అభిమానులు వెల్లడించారు.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus