ఆర్జీవి స్వీయ దర్శకత్వంలో నాగార్జున | నవంబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్!

తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల “శివ” సినిమా ఒక చెరగని సంతకం చేసింది. “శివ” విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వానుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల “రాజుగారి గది 2” ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.

రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. “శివ” సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ “కంపెనీ” బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొనున్న ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ త్వరలోనే రాంగోపాల్ వర్మ వెల్లడిస్తారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus