మరో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టిన రామ్ గోపాల్ వర్మ!

సినీ గ్రామర్ ని ఫాలో కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఆయన సినిమాలు పుస్తకాల్లాంటివి. విభిన్నమైన అనేక కెమెరా షాట్లు/యాంగిల్స్ చూపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వర్మ తన ప్రతి చిత్రంలో కొత్త విషయం ఒకటైనా ఉండేలా ప్లాన్ చేస్తారు.

రీసెంట్ గా బెజ‌వాడ‌ రాజ‌కీయ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన వంగ‌వీటి ప్రచారంలో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఒక సినిమా ప్రచారంలో భాగంగా మీడియా వారికి కొన్ని ఫోటోలను ఇస్తుంటారు. ఈ మధ్య టీజర్, ట్రైలర్ హడావుడి ఎక్కువైంది. వీటిని మించి వంగవీటి చిత్రంలోని కొన్ని కీలకమైన షాట్లను కలిపి దసరా కానుకగా రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ట్విట్టర్లో “మ్యాగ‌జైన్స్ ల‌కు కొన్ని ఫోటో స్టిల్స్ ఇచ్చిన‌ట్టు ఫిలిం ఇండ‌స్ట్రీలో మొద‌టిసారిగా కొన్ని వీడియో షాట్లు” అంటూ ట్వీట్ చేసారు. డ్రోన్ కెమెరాతో తీసిన ఈ షాట్లు వర్మ క్రియేటివిటీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఒక్క డైలాగ్ కూడా లేకుండా .. షాట్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ జత చేసి బయపెట్టించారు. యూట్యూబ్ లో ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 23న రిలీజ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus