నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : రామ్ గోపాల్ వర్మ

సైకిల్ నందులు.. కమ్మ నందులు.. టీడీపీ నందులు అంటూ 2014 , 15 , 16 ఆంద్రప్రదేశ్ నంది అవార్డుల ప్రకటనపై విమర్శలు గుప్పించారు. డైరక్టర్ గుణశేఖర్, నిర్మాతలు బన్నీ వాసు, బుజ్జి, బండ్ల గణేష్ లు మీడియా ముందుకు వచ్చి తన వ్యతిరేకతను ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా కామెంట్ చేశారు. ఏ విషయంపై నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వర్మ నందిపై చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అది ఏమిటంటే…  ” అబ్బో అబ్బో అబ్బో.. ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా… వామ్మో మైండ్ బ్లోయింగ్… సూపర్ డూపర్ సెలక్షన్..

నాకు తెలిసి ఇలా ఏమాత్రం ఒక పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్” అంటూ కమిటీ సభ్యులపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వర్మ మాటలను నందమూరి అభిమానులు కొట్టిపడేస్తుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం లైక్లు, షేర్లు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus