విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టిన రియా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ప్రాణం తీశారా? ఆత్మ హత్య చేసుంటే కారకులు ఎవరు? మర్డర్ అయితే ఎవరు చంపారు? అన్న కోణంలో మొదలైన ఈ కేసు ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం చుట్టూ తిరుగుతుంది. సుశాంత్ ఇంటి పనివాళ్ళు విచారణలో సుశాంత్ తో పాటు, రియా, ఆమె తమ్ముడు షోవిక్ మరియు ఇంటి మేనేజర్ శ్యామ్యూల్ మిరాండా గంజాయి సేవించేవారని చెప్పడం జరిగింది.

దీంతో ఆ కోణంలో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు రియా మరియు ఆమె తమ్ముడు షోవిక్ డ్రగ్ డీలర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. పూర్తి ఆధారాలతో షోవిక్ పట్టుబడగా ఆయనను అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక నార్కోటిక్ కంట్రోల్ బోర్డు ముందు రియా విచారణకు హాజరు అవుతున్నారు. కొన్ని కీలక ఆధారాలు అధికారులు సేకరించిన నేపథ్యంలో రియా సైతం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకుంట్లు సమాచారం. ఐతే తనకు డ్రగ్స్ అలవాటు లేదని, కావాలంటే పరీక్షలకు సిద్ధం అన్నారట.

తాను ఏ తప్పు చేసినా అది సుశాంత్ కోసం, అతని ప్రేమ కోసం చేసినట్లు రియా చెప్పడం గమనార్హం. డ్రగ్స్ కొనుగోళ్ల విషయంలో రియా అరెస్ట్ అవడం ఖాయం అని తెలుస్తుంది. షోవిక్ డ్రగ్స్ కొనుగోళ్ళకు రియా క్రెడిట్ కార్డు వాడినట్లు బయపటపడింది. అలాగే షోవిక్ బాలీవుడ్ లో కొందరికి డ్రగ్స్ సప్లై చేసినట్లు ఒప్పుకున్నారని సమాచారం.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus