Rhea Chakraborty: అమ్మాయిలకు రియా చక్రవర్తి సలహా ఇదే..!

తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రియా చక్రవర్తి.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా ఫేమస్ అయింది. అతడు సూసైడ్ చేసుకున్న కేసులో అందరూ రియాను అనుమానించారు. ఆ తరువాత డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి కూడా వెళ్లింది రియా. జైలు నుంచి బయటకొచ్చిన తరువాత ఆమె సోషల్ మీడియాలో సందేశాత్మక పోస్ట్ లను షేర్ చేస్తుంది. యోగా, మానసిక వికాసంతో కూడిన అంశాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్‌లు వాడే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది రియా. ఇన్‌స్టా గ్రామ్‌ బ్యూటీ ఫిల్టర్ల వలలో పడకండి అంటూ పోస్ట్‌ పెట్టింది ఈ బ్యూటీ. ఈ పోస్ట్‌లో ‘అమ్మాయిలందరికీ ఒక చిన్న విన్నపం. మీరు ఇన్‌స్టా బ్యూటీ ఫిల్టర్‌ల ట్రాప్‌లో పడకండి. అదొక మాయ. మీరు ఎలా ఉన్నారో అదే మీ అందం. ఈ మధ్య మీరు ఈ ఇన్‌స్టా బ్యూటీ, ఫిల్టర్ల గురించి ఎలా ఫీల్ అవుతున్నారని నన్ను అడుగుతున్నారు.

వారందరికీ నెను చెప్పేది ఒక్కటే. మీకు మీరుగా ఉండటమే నిజమైన అందం’ అని తెలిపింది రియా. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది విడుదలైన ‘చెహ్రె’ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ప్రస్తుతం రియా చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. తెలుగులో ఈ బ్యూటీ రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus