Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

ఆ మధ్య ఒకసారి తారక్‌ తన కుటుంబంతో కుందాపుర్‌ వెళ్లాడు గుర్తుందా? అప్పుడు అక్కడ కన్నడ స్టార్‌ హీరో రిషభ్‌ శెట్టి ఎన్టీఆర్‌కి ఆతిథ్యం ఇచ్చాడు. దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం, స్నేహం ఉందని ఫ్యాన్స్‌కి తెలిసింది. దాని వెనుక ఉన్న కారణాల్లో ఇద్దరూ కుందాపుర్‌కి చెందిన వారు కావడం అని చెప్పొచ్చు. ఈ కుందాపుర్‌ బాయ్స్‌ ఇప్పుడు కలసి ఒకే సినిమాలో నటిస్తున్నారట. అయితే ఒకరిది టైటిల్‌ రోల్‌ కాగా, మరొకరికి అతిథి పాత్ర అని సమాచారం.

Rishab Shetty

ఇప్పుడు నిడివి చాలా తక్కువ ఉన్న అతిథి పాత్రలు సైతం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా కీలక దశలో ఎవరూ ఊహించనట్లుగా (ఇప్పుడు ముందే లీక్‌ అవుతున్నాయి అనుకోండి) వచ్చి అలరిస్తునన్నారు. ఇప్పుడు అలా ఎన్టీఆర్‌ నటిస్తున్న కొత్త సినిమాలోనూ కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌ శెట్టి కనిపిస్తాడట. ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కలయికలో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌)లో ఈ కాంబో ఉండనుందట. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి రిషబ్‌ అడుగు పెట్టనున్నాడని ప్రచారం.

ప్రశాంత్‌ నీల్‌ – తారక్‌కు రిషబ్‌ శెట్టితో మంచి పరిచయం ఉంది. గతంలో చెప్పినట్లు ఓ సందర్భంలో మూడు కుటుంబాలు కలిశాయి. ఇప్పుడు ఆ పరిచయంతోనే సినిమాలో నటించమని తారక్‌, ప్రశాంత్‌.. రిషభ్‌ని అడిగారట. ఆయన కూడా ఓకే చెప్పడంతో ఆలోచన కార్యరూపం దాల్చిందట. మరి ఆ పాత్రేంటి, ఎలా ఉంటుంది లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఎంతవరకు వచ్చింది అనే వివరాలు బయటకు రాలేదు కానీ.. మేజర్‌ సీన్స్‌ కొన్ని ఇటీవల తీశారట.

రామోజీ ఫిలింసిటీలో అలనాటి పశ్చిమ బెంగాల్‌ సెట్‌ రూపొందించి కొన్ని సీన్స్‌ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం తారక్‌ బాగా సన్నబడ్డాడు. అయితే ఇప్పుడు మళ్లీ కాస్త కంట్రోల్డ్‌ లుక్‌లోకి వస్తున్నాడు. ఈ మార్పులు ఎందుకు అనేది సినిమా వచ్చాక కానీ తెలియదు. చూద్దాం మరి నీల్‌ మామ ఆలోచనేంటో?

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus