సుమన్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘జయం’ తో కెరీర్ ప్రారంభించిన అతను తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. మంచి క్రేజ్ సంపాదించుకుని బిజీ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇటీవల అతను ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లో అతను చాలా వరకు కామ్ గా ఉంటున్నాడు. అస్సలు నోరు విప్పడం లేదు. కానీ తన జోలికి వస్తే మాత్రం స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతున్నాడు.
ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి గురించి దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
దర్శకుడు తేజ మాట్లాడుతూ..” ‘జయం’ తో నేను సుమన్ శెట్టిని ఇంట్రడ్యూస్ చేశాను.అతనికి మంచి పేరు వచ్చింది. ఆ టైంలో నేను అతనితో..’నీకు ఇంకా సినిమాలు వస్తాయి. కాబట్టి.. నువ్వు ముందుగా ఒక మంచి సైట్ కొనుక్కుని.. అందులో ఇల్లు కట్టుకో’ అని చెప్పాను. ఆ మాట విని అతను నిజంగానే సైట్ కొన్నాడు. ఓ రోజు నన్ను కలిసి ‘ఇల్లు కడుతున్నా సార్.. ఇదంతా మీ వల్లే’ అని చెప్పి నా కాళ్ళు పట్టుకోబోయాడు.
అందుకు నేను ‘కాళ్ళు పట్టుకోవద్దమ్మా’ అని అన్నాను. అందుకు అతను ‘నేను మీకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో చెప్పండి సార్’ అన్నాడు. దీంతో నేను ‘నువ్వు ఇల్లు కడుతున్నావ్ కదా..! అందులో నా కోసం ఒక రూమ్ ఉంచు. ఎందుకంటే నేను కొత్త వాళ్ళతోనే సినిమాలు తీస్తూ ఉంటాను. కాబట్టి ఏదో ఒక రోజు.. నేను రోడ్డు మీదకు వచ్చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు నాకు ఇల్లు ఉండదు.
కానీ ఈ రూమ్ నాకు ఉంటుంది’ అని చెప్పాను. దాన్ని అతను సీరియస్ గా తీసుకుని. నా కోసం నిజంగానే రూమ్ కట్టించి.. నా ఫోటో పెట్టాడు. అది అతని గ్రాటిట్యూడ్” అంటూ సుమన్ శెట్టి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.
నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు#directorteja #teja #DirectorTeja #SumanShetty #BiggBossTelugu9 #BiggBoss9 pic.twitter.com/LUAawsLN1J
— Phani Kumar (@phanikumar2809) September 17, 2025