Rishab Shetty, Jr NTR: ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో: రిషబ్ శెట్టి

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి నోట వెంట విన్న కాంతారా సినిమా పేరు వినపడుతోంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రూపొందించిన ఈ సినిమా తెలుగులో విడుదల అయింది. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదలై ఎంతో మంచి గుర్తింపు ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి మంచి హిట్ అందుకోవడంతో రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా కేరళలోని కాంబ్లా, బూటాకోలా సంప్రదాయ సంస్కృతిని తెలియజేస్తూ రిషబ్ శెట్టి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రిషబ్ శెట్టి ఎన్నో విషయాలను తెలియచేస్తూ నాకు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక కామన్ కనెక్షన్ ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. ఆయనప్పటికీ తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని తనే నా ఫేవరెట్ హీరో అంటూ రిషబ్ శెట్టి వెల్లడించారు.ఆయనతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. మరొక విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మా అమ్మగారి ఇద్దరిదీ ఒకే గ్రామం అని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

ఇక రిషబ్ శెట్టి నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే మీ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా ఇప్పటివరకు అలాంటి ఆలోచన లేదని అయితే సరైన కథ కాన్సెప్ట్ దొరికితే తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేస్తామని రిషబ్ శెట్టి వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus