Kantara: రిషబ్‌ శెట్టి ‘కాంతార’లో నటించాలని అనుకోలేదట!

  • October 30, 2022 / 05:33 PM IST

అప్పటికే నటుడిగా తెలిసినా.. ‘రిక్కీ’ సినిమాతో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు రిషబ్‌ శెట్టి. ‘కిర్రాక్‌ పార్టీతో’ సౌత్‌లో చాలామంది తెలిశాడు. అయితే రిషబ్‌ శెట్టి అంటే ఏంటో తెలిసింది మాత్రం ‘కాంతార’తోనే. ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతివాళ్లూ.. రిషబ్‌ గురించి మాట్లాడారు. దానికి కారణం అన్నీ ఆయనే అయి ఉండి ఆ సినిమాను తీయడం, చేయడం. అయితే ఈ సినిమా కథ తొలుత ఓ అగ్రహీరో వద్దకు వెళ్లిందట. ఆయన మాటతోనే రిషబ్‌ ఆ కథలో నటించాడట.

2016లో ‘కిరిక్‌ పార్టీ’ అనే సినిమాను దర్శకుడిగా చేశాడు రిషబ్‌ శెట్టి. తీస్తే అది పెద్ద హిట్టయింది. ఆ డబ్బుతోనే ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ అనే తన కలల ప్రాజెక్టు చేశాడు. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ‘బెల్‌బాటమ్‌’ అనే సినిమాతో హీరో అవ్వాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ఈ సమయంలో తన నెక్స్ట్‌ మూవీ.. మామూలుగా ఉండకూడదని ఫిక్స్‌ అయిపోయాడు. అయితే దాని కోసం తన సొంతూరు కథనే ఎంచుకున్నాడు.

ఉడుపి జిల్లాలోని కుందాపుర ప్రాంతంలో పుట్టి పెరిగాడు రిషబ్‌. భూతకోల దైవారాధన ఆ ప్రాంతంలో నిత్యం అనుసరించే సంప్రదాయం. ఆ ప్రాంత ప్రత్యేక జీవన శైలీ, సంస్కృతుల్ని ప్రతిబింబించే సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే.. ఆ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండాలని ముందుగానే ఫిక్స్‌ అయ్యాడట. అందుకోసమే హోంబలే ప్రొడక్షన్‌ హౌస్‌ను సంప్రదించాడు. అంతా ఓకే అనుకున్నాక పునీత్‌ రాజ్‌కుమార్‌తో సినిమా చేయాలని అనుకున్నాడట.

ఇదే విషయం పునీత్‌ రాజ్‌కుమార్‌తో చెబితే.. ఆ మట్టి వాసన బాగా పండాలంటే.. హీరోగా నువ్వే నటించాలి అని సలహా ఇచ్చాడట. అలా ‘కాంతార’కు హీరోగానూ, దర్శకుడిగానూ అవతారమెత్తాడు రిషబ్‌. సొంతూరిలోనే సెట్‌ వేసి తీశాం సినిమా చేశాడు. ఊరు పక్కనే ఉన్న అడవిలో కొన్ని సీన్స్‌ తీశాడు. సినిమాలో కనిపించే వారిలో 80 శాతం మంది వాళ్ల ఊరివాళ్లేనట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus