Riya Chakravarty: సుశాంత్‌ మరణం తర్వాత జీవితం మారిపోయిందంటున్న హీరోయిన్‌!

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం వెనుక ఏం జరిగింది అనే విషయంలో ఇప్పటివరకు సరైన క్లారిటీ రావడం లేదు. ఒక్కో వర్గం ఒక్కోలా చెబుతున్నాయి. వీటిపై ఎప్పటికి క్లారిటీ వస్తుందో అనేది అభిమానుల ఆవేదన. మూడేళ్లుగా ఏటా సుశాంత్‌ జయంతికి, వర్థంతికి ఈ విషయాన్ని ప్రముఖంగా సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తున్నారు కూడా. అయితే ఇక్కడ మరో వ్యక్తి వేదన కూడా ఉందనే విషయం మనం మరచిపోకూడదు. ఆ వ్యక్తే యువ కథానాయిక రియా చక్రవర్తి.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి మూడు ఏళ్లు గడుస్తున్నా ఆ కేసు మిస్టరీగానే ఉంది. ఈ విషయంలో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది కూడా. చాలా రోజులు మీడియాకు దూరంగా ఉన్న రియా ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్ఆలడుతూ… సుశాంత్‌ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెబుతూ బాధపడింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మనుషులం కాబట్టి జీవితంలో ఏం జరిగినా ముందుకు సాగక తప్పదు అనే మాటను నమ్ముతుందట రియా చక్రవర్తి. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని, ఆ విషాదం నుండి తేరుకుని మాములు మనిషిని అవ్వడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. మీడియాలో ఇప్పటికే నాపై చాలా కథనాలు వచ్చాయి. వాటి వల్ల జీవితంలో చాలా నష్టపోయాను కూడా. ఆఖరికి ఏడవడానికి కూడా వాళ్లు నాకు సమయం ఇవ్వలేదు అంటూ తన పరిస్థితి వివరించే ప్రయత్నం చేసింది. జీవితంలో ఎన్నో మానసిక సంఘర్షణలను దాటి వచ్చాను అంటూ చెప్పిన రియా… సుశాంత్‌ లేని లోటు తన జీవితంలో ఎప్పటికీ తీర్చలేనిదని చెప్పుకొచ్చింది.

ఇప్పుడే కాదు, నా (Riya Chakravarty) జీవితమంతా సుశాంత్‌ను మిస్‌ అవుతూనే ఉంటాను అని చెప్పింది. నా ప్రియ స్నేహితుడు, సహచరుడు లేకుండా జీవించడం చాలా కష్టం, కానీ ముందుకుసాగక తప్పదు అంటూ బరువైన హృదయంతో చెప్పుకొచ్చింది రియా. మా నాన్న సైన్యంలో పని చేశారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని చెబుతుండేవారు. ఎందుకంటే అన్నింటికి కంటే జీవించాలనే సంకల్పం పెద్దది అంటూ వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయింది రియా.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus