త్వరలో థియేటర్స్ లో ఆర్కే నాయుడు ”ద 100” చిత్రం

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.. ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు హీరో ఆర్కే సాగర్.

”ద 100” అనే వైవిధ్యమైన టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు.

గతంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కు చాల అంతర్జాతీయ అవార్డ్స్ రావడం జరిగింది. ద 100 సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపిఎస్ అధికారి పాత్రలో ఆర్కే సాగర్ నటిస్తున్నాడు.’ద 100′ చిత్రంలో తన పాత్ర కోసం ఆర్కే సాగర్ ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ పోస్టర్‌ లో పంచింగ్ హ్యాండ్ ని గమనిస్తే.. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మంచి యాక్షన్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విక్రాంత్ ఐపిఎస్ పాత్రలో ఆర్కే సాగర్ ఇంప్రెస్ చేయనున్నాడు, ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి కి, బాలీవుడ్ చిత్రం యనిమల్ కి సంగీతం సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకున్న ‘ద 100’ చిత్రం త్వరలో థియేటర్స్ లో విడుదల కాబోతోంది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ అందరూ చూడదగ్గ సినిమాగా ఈ మూవీని తీర్చిదిద్దడం జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus