Rohini: బిగ్ బాస్ 8… టాప్ 5 లెక్కలు మార్చేసిన రోహిణి!

అవును రోహిణి (Rohini) వల్ల టాప్ 5 లెక్కలు మారిపోయేలా ఉన్నాయి అనే చెప్పాలి.పృథ్వీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ని ఫిజికల్ టాస్క్ లో ఓడించి ఆమె మెగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అంతకు ముందు ‘నువ్వు ఫిజికల్ టాస్కులు ఆడలేవు’ అని ఎవరైతే ఈమెను విమర్శించారో వాళ్ళు కూడా భయపడేలా చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం ‘టికెటు టు ఫినాలే’ టాస్కు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాలికి ఆపరేషన్ అయి రాడ్ వేసినా సరే..

Rohini

రోహిణి తగ్గకుండా విష్ణుప్రియ (Vishnu Priya) అండ్ టీంని ఓడించింది.నిన్న మొన్నటి వరకు గౌతమ్, నిఖిల్ (Nikhil)  , నబీల్ (Nabeel Afridi), ప్రేరణ  (Prerana) , పృథ్వీ (Prithviraj) / విష్ణు ప్రియ  వంటి కంటెస్టెంట్స్ పేర్లు టాప్ 5 లో ఉంటాయి అని అంతా భావించారు.కానీ ఈ వారం నామినేషన్స్ లో రోహిణి పేరు లేదు. టికెట్ టూ ఫినాలే కంటెండర్ గా ఆమె ప్రస్తుతం పోటీలో ఉంది. ఈ టైంలో రోహిణి కనుక టికెట్ టు ఫినాలే రేసులో గెలిస్తే టాప్ 5 లెక్కలు కచ్చితంగా మారిపోతాయి.

‘బిగ్ బాస్ 8’ కి రోహిణి (Rohini) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. పృద్వి, నబీల్, విష్ణుప్రియ వంటి వాళ్ళతో మాటలు పడింది. ఆ అవమానాలే ఆమెలో గెలవాలనే కసిని నింపాయి అనుకోవాలి. గతంలో అంటే ‘బిగ్ బాస్ 3’ లో కూడా రోహిణి ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

ఆ టైంలో చేసిన చిన్న తప్పు వల్ల ‘బిగ్ బాసే’ ఆమెను నామినేట్ చేశాడు. తర్వాత ఓట్లు తక్కువ పడటంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అంతే తప్ప ఆ టైంలో ఈమెను హౌస్మేట్స్ ఎక్కువగా నామినేట్ చేసింది లేదు. మరి బిగ్ బాస్ 8 రోహిణికి ఎలా కలిసొస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus