గ్లామర్ రోల్స్ కి సిద్ధమంటున్న రుహాని శర్మ

  • August 14, 2018 / 07:57 AM IST

నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన మూవీ “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 3న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సుశాంత్, రుహాని శర్మ లు చాలా నేచురల్ గా నటించారు. రుహాని శర్మ తనలోని నటనను మాత్రమే ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది. పక్కింటి అమ్మాయిగా పెఱ్ఱుతెచుకుంది. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది.

తాను అభినయంలోనే కాదు అందం లోను ఎవరికీ తీసిపోనని చెప్పింది. రీసెంట్ గా రుహాని శర్మ ఓ ఫోటో షూట్ లో పాల్గొని కుర్రకారుల మతులు పోగొడుతోంది. అలాగే టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. రుహాని శర్మ హాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. ఈ దెబ్బతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆఫర్లు అందుకుంటుందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus