ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టనున్న భీమ్,రాఖీ భాయ్ …!

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇదిలా ఉండగా.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే.దాంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి అప్పుడే మొదలైపోయింది. ఆ రోజున ‘రాధే శ్యామ్’ టీజర్ కూడా విడుదల చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ అలాగే.. ‘ఓం రౌత్’ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘ఆది పురుష్’ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం.

అంతేకాదు ప్రభాస్ మరో ప్రాజెక్టుకి కూడా సైన్ చేసాడని.. దానికి సంబంధించిన వివరాలు కూడా అదే రోజున వెలువడనున్నాయని కూడా టాక్. సరే ప్రభాస్ సినిమాలకు సంబంధించి 3 అప్డేట్ లు ఆరోజు రావడం అయితే గ్యారెంటీ అని తెలుస్తుంది. అయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. ఎందుకంటే అక్టోబర్ 22న ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ భీమ్ టీజర్ రాబోతుందని ఇప్పటికే ఆ చిత్రం యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ టీజర్ కూడా అదే టైంలో విడుదల కాబోతుందని కూడా తాజా సమాచారం.నిజానికి ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రాన్ని అక్టోబర్ 23నే విడుదల చెయ్యాలి అనుకున్నారు.

కరోనా ఎఫెక్ట్ వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ హర్ట్ చెయ్యకుండా అదే రోజున టీజర్ విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. అలా అయితే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను జనాలు పట్టించుకుంటరా అనేది పెద్ద ప్రశ్న. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్’ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ ఎంత పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు నెగిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి ఆ 3 సినిమాల అప్డేట్స్ పెద్దగా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉండదేమో..!

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus