తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ హవా కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజుల పాటు టికెట్లు దొరకడం కష్టమవుతోంది. ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు టికెట్ రేటు ఉన్నా ఫ్యాన్స్ మాత్రం టికెట్లను కొనుగోలు చేయడానికి అస్సలు తగ్గడం లేదు. ఓవర్సీస్ లో, బెంగళూరులో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. బెంగళూరు నగరంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆర్ఆర్ఆర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.
Click Here To Watch NEW Trailer
రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ హిందీలో కూడా ఈ సినిమాకు భారీస్థాయిలో ప్రమోషన్స్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అలియా భట్, అజయ్ దేవగణ్ ఆర్ఆర్ఆర్ లో నటించినా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ముంబైలోని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ కు ఎక్కువ సంఖ్యలో టికెట్లు బుకింగ్ కాలేదు. అయితే ఆర్ఆర్ఆర్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పరిస్థితి మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాహుబలి2 మ్యాజిక్ ను ఆర్ఆర్ఆర్ తో జక్కన్న రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ రికార్డులు చేస్తుందనడంలో సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా కనీసం 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అంచనాలకు మించి ఉండబోతున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తో కొత్త రికార్డులు కచ్చితంగా క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా టికెట్ రేట్లపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కు టికెట్ రేట్లను తగ్గిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!