వైరలవుతున్న ‘కె.జి.ఎఫ్2’ లీక్డ్ వీడియో..!

  • February 4, 2020 / 04:29 PM IST

స్మార్ట్ ఫోన్లు వచ్చాక ముఖ్యంగా ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సినిమా షూటింగ్ లోకి కొన్ని పిక్స్ మరియు వీడియోలు తీసేసి కొంతమంది అతి ఉత్సాహం కలిగిన వారు.. తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం.. అవి కాస్త వైరల్ అవ్వడం ఎక్కువైపోయింది. నిర్మాతలు, దర్శకులు ఎంత కంట్రోల్ చెయ్యాలని.. కఠినంగా ప్రవర్తించినా దీనిని అరికట్టాలని ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కు సంబంధించి వీడియో లీక్ అవ్వడం. తరువాత పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ కు సంబందించిన వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ‘కె.జి.ఎఫ్2’ కూడా చేరిపోయింది.

2018 లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మైసూర్‌లోని గ్లోబుల్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌లో జరుగుతుంది. అనూహ్యంగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతున్నాయి. యశ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కు ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ విలన్ గా నటిస్తుండడం విశేషం.

Most Recommended Video


అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus