RRR Movie: ఆ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్!

  • November 17, 2021 / 08:58 PM IST

చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ మిస్ అయితే సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాల్సి ఉండటంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ సంక్రాంతి సీజన్ ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా దేశంలో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన సీజీ పనులు జరుగుతున్నాయని బోగట్టా. ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాల విషయంలో వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. డిసెంబర్ నెలలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. మన దేశంలో 10,000 స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే రిలీజ్ విషయంలో ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా 2500 స్క్రీన్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని 2 గంటల 45 నిమిషాలు ఈ సినిమా నిడివి అని సమాచారం. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus