RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ని చెత్త సినిమా అంటోన్న కేఆర్కే!

  • March 25, 2022 / 03:01 PM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ సినిమా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో కూడా ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి.

Click Here To Watch NOW

అలాంటి ఈ సినిమాను చెత్త అని సింపుల్ గా తేల్చేశాడు బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్. తనకు నచ్చని విషయాన్ని అందరికీ ఆపాదించి విమర్శలు చేసే క్రిటిక్ గా పేరున్న కమల్ ఆర్ ఖాన్ మరోసారి ‘ఆర్ఆర్ఆర్’పై నెగెటివ్ ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. రాజమౌళి తలా, తోక లేని సినిమా తీశారని.. దానికోసం ఆయన్ని ఆరు నెలల పాటు జైల్లో పెట్టాలని కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు తీయనటువంటి చెత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అని రాసుకొచ్చాడు.

రూ.600 కోట్ల బడ్జెట్ తో ఇలాంటి సినిమా తీసినందుకు రాజమౌళిని ఆరు నెలల పాటు జైల్లో పెట్టాలని అన్నాడు. బాలీవుడ్ డిజాస్టర్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతో దీన్ని పోల్చి సౌత్ సినిమాపై తన అక్కసు వెళ్లగక్కాడు. కమల్ ఆర్ ఖాన్ పెట్టిన ఈ పోస్ట్ లపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి రివ్యూ ఇచ్చే అర్హత కూడా నీకు లేదంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయడానికి సిగ్గుగా లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

1920ల్లో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఇద్ద‌రు యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ సినిమా ఇది. ఇందులో ఆలియా భ‌ట్‌, అజయ్ దేవ‌గ‌ణ్, శ్రియాశరన్ ఇలా భారీతారాగణం నటించారు. ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి హాలీవుడ్ తార‌లు కూడా కనిపించారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus