ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటికే 90 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతోందని ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన షూటింగ్ మళ్ళీ వాయిదా పడటంతో ఆ టైంకి విడుదల కావడం కష్టమనే చర్చ కూడా కొద్దిరోజుల నుండీ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ వివరాలు చాన్నాళ్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా వీటి వివరాలు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ విడుదల చేయబోతుండడంతో ‘పెన్ మూవీస్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ‘పెన్ మూవీస్’ వారు ఆ వివరాలను కూడా తెలియజేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీ థియేట్రికల్ హక్కులను ‘పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్మెంట్స్’ దక్కించుకుంది.ఇక డిజిటల్ స్ట్రీమింగ్‌లో భాగంగా జీ5 (తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ), నెట్ ఫ్లిక్స్ (హిందీ, ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్, స్పానీష్) శాటిలైట్ పార్ట్నర్ (జీ సినిమా-హిందీ, స్టార్ మా-తెలుగు, స్టార్ విజయ్-తమిళం,
ఏసియా నెట్-మళయాలం, స్టార్ సువర్ణ-కన్నడ) హక్కులను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ‘పెన్ మూవీస్’ సంస్థ…దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాత దానయ్య లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
Most Recommended Video
10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!