‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తోన్న ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి అలాగే నిర్మాత డీవీవీ దానయ్య ఇది వరకే.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే షూటింగ్ ను కూడా శరవేగంగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. ఇక ఈ చిత్రం రైట్స్ కోసం బయ్యర్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలో వెస్ట్ గోదావరి జిల్లా రైట్స్ కూడా భారీ రేటుకి అమ్మేసారట.
ట్రేడ్ వర్గాల నుండీ అందుతోన్న సమాచారం ప్రకారం…. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పశ్చిమగోదావరి జిల్లా రైట్స్ ను ‘గీతా షన్ముఖ ఫిలింస్’ సంస్థ 13కోట్లు చెల్లించి దక్కించుకుందట. కేవలం వెస్ట్ గోదావరి మాత్రమే కాదు…. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రానికి భారీ రేట్లు పలుకుతున్నాయట.ఏకంగా పది భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు టాక్ నడుస్తుంది. హిందీ లోనూ అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి దిమ్మ తిరిగే బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?