టాలీవుడ్లో కరోనా పరిస్థితుల వల్ల చాలా సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి. అందులో పెద్ద సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పాలి. సినిమా మొదలెట్టినప్పుడు విడుదల తేదీ చెప్పేసి రెడీ అయిపోండి అన్నారు. అయితే రామ్‌చరణ్, ఎన్టీఆర్ చిత్రీకరణలో స్వల్పంగ గాయపడటంతో చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి మొదలైంది అనుకుంటుడగా అయితే అదే సమయంలో కరోనా దేశంలోకి ఎంటర్ అయ్యింది. ఇంకేముంది సినిమా వాయిదా పడింది. ఇప్పటికీ వాయిదా పడుతూనే ఉంది. దీంతో రిలీజ్ డేట్లు మారిపోతున్నాయి.
సినిమా కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే… సినిమా ప్రధాన పాత్రధారులు, టీమ్ కీలక సభ్యులు కరోనా బారినపడ్డారు. దీంతో అనుకున్నట్లు షూటింగ్ అవ్వలేదు. మరోవైపు లాక్డౌన్ మళ్లీ వచ్చేసింది. దీంతో మళ్లీ వాయిదా. అయితే సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాలు మాత్రం వివిధ సందర్భాల్లో చిత్రబృందం విడుదల చేస్తోంది. అయితే టీజర్ ఎప్పుడు అనేదే అందరి ప్రశ్న. దీనికి సమాధానం ఓ స్పెషల్ డే నాడు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు సినిమా టీజర్‌ను విడుదల చేస్తారని రీసెంట్ టాక్. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా టీజర్ విడుదలకు ఇంతకంటే మంచి తేదీ ఇంకేదీ ఉండదని అనుకుంటున్నారట.లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఆ రోజుకు టీజర్ సిద్ధం చేసే అవకాశం ఉందా అంటే కష్టమనే చెప్పాలి. అయితే వీలైనంతవరకు ఆన్లైన్లో టీమ్‌తో టచ్‌లో ఉండి ఆ రోజుకు టీజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందట.