ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రుద్రాక్షపురం’

Advertisement

ఆర్.కె.గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘రుద్రాక్షపురం’. “మెకానిక్” ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నాగ మహేష్ కీలక పాత్ర పోషించగా… ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.

తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నటి – ఎన్నారై ప్రశాంతి హారతి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, మెకానిక్ దర్శకుడు ముని సహేకర్, ప్రముఖ దర్శకుడు శ్రీరాజ్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరై “రుద్రాక్షపురం” ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. “రుద్రాక్షపురం” చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus