రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

నేషనల్‌ క్రష్‌ అని మొన్నీమధ్య వరకు ఫ్యాన్స్‌ నెత్తిన పెట్టుకున్న రష్మిక మందన.. ఆ బిరుదుకు తగ్గట్టే నేషనల్‌ వైడ్‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఆ బిరుదును వేరే హీరోయిన్‌కి ఇచ్చేశారు అభిమానులు. అలా అని మొదటి హీరోయిన్‌కి తీసేయలేదు అనుకోండి. ఇప్పుడు కొత్త నేషనల్‌ క్రష్‌ అయిన హీరోయిన్‌ కూడా నేషనల్‌ వైడ్‌ తన హవా చాటడానికి రెడీ అవుతోంది. కన్నడ సినిమాను ఫాలో అవుతున్నవారికి ఆ కొత్త జాతీయ క్రష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెనే రుక్మిణి వసంత్‌.

Rukmini Vasanth

‘సప్తసాగరాలు దాటి’ రెండు సినిమాలతో సౌత్‌ సినిమా ప్రేక్షకులకు, ‘కాంతార’ సినిమాలతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయి రుక్మిణి వసంత్‌.. ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు ఆమె ఆలోచనలు, మాటలు వింటుంటే బాలీవుడ్‌కి రేపో మాపో వెళ్లిపోయేలా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రుక్మిణి.. హిందీ భాష గురించి చెప్పుకొచ్చింది. హిందీ నాకు చిన్నప్పటి నుండి సుపరిచితమైన భాష. బాలీవుడ్‌ సినిమాల పట్ల ఎప్పుడూ ఆసక్తి ఉండేది అని చెప్పింది.

ఇప్పుడు సందర్భం లేకుండా హిందీ భాష గురించి, హిందీ సినిమా గురించి ఎందుకు మాట్లాడిందా అని చూస్తే.. ఆమెకు అక్కడి నుండి కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఇప్పటికే ఓ హిందీ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అంటే రష్మిక మందనలా రుక్కు కూడా శాండిల్‌ వుడ్‌ టు టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ అనబోతోంది. మరి ఏ సినిమా కథలు వింది, ఏది ఓకే చేసింది అనేది చూడాలి. ఇదంతా ఓకే కానీ ఆమెకు హిందీ టచ్‌ ఎలా అనేగా మీ డౌట్‌.

ఆ విషయం కూడా చెప్పింది కొత్త క్రష్‌. వాళ్ల ఫ్యామిలీ నేపథ్యం ఆర్మీ. తండ్రి సైన్యంలో పని చేయడం వల్ల దేశం మొత్తం తిరిగేవారు. అలా కొన్నాళ్లు రుక్మిణి నార్త్‌లో పెరిగింది. హిందీ వచ్చు కానీ.. ఆ లాంగ్వేజ్‌లో భావోద్వేగాలను చూపించే అవకాశం రాలేదు. ఆ ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. దీని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. దేవుడి దయతో త్వరలోనే ఆ పని ప్రారంభిస్తానని అనుకుంటున్నా అని హిందీ ఎంట్రీ లీక్‌ ఇచ్చింది.

 పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus