మొన్నీమధ్యే ‘ఓజీ’ సినిమాతో మునపటి పవన్ కల్యాణ్‌ను చూసిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్‌కి ‘దేఖ్ లేంగే సాలా’ అంటూ అంతకుమించిన ఆనందాన్ని అందించారు. తొలి ఆనందాన్నిచ్చింది ఫ్యాన్ బాయ్ సుజీత్ అయితే.. డబుల్ ఆనందాన్నిచ్చింది ఫ్యాన్ డైరక్టర్ హరీశ్ శంకర్. ఏంటి ఒక పాటకే ఫ్యాన్స్ ఆనందపడిపోయారా అంటారా? కచ్చితంగా ఆనందపడిపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఊపు అలా ఉంది మరి.
కావాలంటే మీరే ఓసారి సోషల్ మీడియాలోకి వెళ్లి చూడండి. ‘దేఖ్‌లేంగే సాలా..’ పాట వచ్చినప్పటి నుండి రీల్స్, మీమ్స్, ట్వీట్స్, పోస్ట్స్ అదిరిపోతున్నాయి. మునపటి వపన్ కల్యాణ్‌ని చూశామని కొందరు.. ఆ గ్రేసేంటి, స్వాగేంటి, లుక్ ఏంటి, ఊపేంటి అంటూ మురిసిపోతున్నారు. వారి ఆనందానికి తగ్గట్టే ఉంది పాటలో పవన్ లుక్, డ్యాన్స్ కూడా. స్టెప్పులు హెవీగా లేకపోయినా, మాస్ టచ్ కనిపించకపోయినా పవన్ స్టైల్‌కి, కటౌట్‌కి పర్‌ఫెక్ట్ మిక్స్ అయ్యాయి.
పవన్ కల్యాణ్‌కి సరైన విజయం లేని సమయంలో హరీశ్ శంకర్ వచ్చి ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా తీశారు. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు మొత్తం మటాష్ అయిపోయాయి. పవన్ లుక్, స్వాగ్, యాక్షన్, ఆ సినిమాలో మరో లెవల్‌లో ఉంటాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటున్నారు హరీశ్ శంకర్. దానికి చిన్న టీజర్ ఈ పాట అని చెప్పొచ్చు.
ఇప్పటికే వచ్చిన రెండు టీజర్లు అదిరిపోయాయి.. ఇప్పుడు మూడో ప్రచార చిత్రంగా వచ్చిన ఈ పాట వాటికి మించి ఉంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆసక్తికరం. అయితే ఇక్కడే ఓ విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ ‘ఓజీ’ సినిమాను మించిన సినిమాగతా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉంటుందని చెప్పారు. మరి ఆ పనిని హరీశ్ శంకర్ ఎలా చేస్తారో చూడాలి.