రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 20, 2019 / 10:20 AM IST

“ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాలతో నటుడిగా, నిర్మాతగా భారీ పరాజయాన్ని అందుకున్న బాలయ్య.. అందులో నుండి బయటకు రావడానికి చేసిన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ “రూలర్”. “జై సింహా” లాంటి సూపర్ హిట్ అనంతరం బాలయ్య-కె.ఎస్.రవికుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయి హైప్ రాలేదు. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సి.ఈ.ఓ. డబ్బు కంటే విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. తనకు ఆశ్రయమిచ్చిన బిజినెస్ ఉమెన్ (జయసుధ) ఉత్తర ప్రదేశ్ లో చేజిక్కించుకోలేకపోయిన సోలార్ ప్రొజెక్ట్ ను డీల్ చేయడం కోసం అక్కడికి వెళ్తాడు.

కట్ చేస్తే.. అర్జున్ ప్రసాద్ అసలు పేరు ధర్మ అని.. ఉత్తర్ ప్రదేశ్ లో పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసేవాడని ట్విస్ట్ రివీల్ అవుతుంది.

అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ.. సి.ఈ.ఓ అర్జున్ ప్రసాద్ అవతారం ఎందుకు ఎతాల్సి వచ్చింది అనేది “రూలర్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: బాలయ్య ఎప్పట్లానే రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొన్నాడు. ధర్మ కంటే అర్జున్ ప్రసాద్ పాత్ర జనాలకు బాగా నచ్చుతుంది. స్టైలిష్ గెటప్ తో బాలయ్య చెప్పే డైలాగులు, చేసిన డ్యాన్సులు మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటాయి.

సోనాల్ చౌహాన్, వేదికల అందాలు మాస్ ఆడియన్స్ కు కనువిందు చేస్తాయి. భూమిక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. జయసుధ, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: చిరంతన్ పాటలు ఆకట్టుకొనే స్థాయిలో లేకపోయినా.. ఆ పాటలకు బాలయ్య స్టెప్పులు మాత్రం అలరిస్తాయి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కె.ఎస్.రవికుమార్ రాసుకున్న కథ 90ల కాలం నాటిది. ఈ జనరేషన్ జనాలు సినిమాని ఎంజాయ్ చేయడం కష్టమే. ఇక కథనం కూడా ఆకట్టుకొనే స్థాయిలో లేదు. బాలయ్య వీరాభిమానులకు కూడా బోర్ కొట్టే స్థాయిలో ఉంది స్క్రీన్ ప్లే. కేవలం బి, సి సెంటర్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంతో కె.ఎస్.రవికుమార్ మరోసారి విజయాన్ని అందుకోవడం కష్టమే.

విశ్లేషణ: బాలయ్య మీద వీరాభిమానంతోపాటు బోలెడంత సహనం, ఓపిక ఉంటే ఈ ఫక్తు కమర్షియల్ సినిమాను కాస్త ఎంజాయ్ చేయగలరు. లేదంటే కాస్త కష్టమే సుమీ!

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus