Ram Charan, Dhoni: చరణ్-ధోని కాంబోనేషన్ లో సినిమా.. అన్నిభాషల్లో ఉండబోతుందా..!

Advertisement

ఆర్. ఆర్ ఆర్. చిత్రం గ్రాండ్ సక్సెస్ తో రామ్ చరణ్కి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ దక్కిందో అందరికీతెలిసిందే. ఈ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ అనే పేరు బలంగా వినిపించింది.ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంషూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల అయ్యేఛాన్స్ ఉంది.

ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చి బాబు తో ఒక పీరియడ్ డ్రామా చిత్రంచేస్తున్నాడు. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీటి తర్వాతసుకుమార్ తో ఒక సినిమా, బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ఒకసినిమా ఓకే చేసాడు. ఈ ప్రాజెక్ట్స్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ ప్రముఖఇండియన్ క్రికెటర్, మన దేశానికీ మూడు వరల్డ్ కప్స్ నితెచ్చి పెట్టిన మహేంద్ర సింగ్ ధోని ని కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒకరేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ధోని తో గతం లో రామ్ చరణ్ (Ram Charan) కలిసి పెప్సీ యాడ్ చేసాడు.మళ్ళీ ఇన్ని రోజులకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని తెలుస్తుంది. ధోనిభార్య రీసెంట్ గానే ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థ ని ఏర్పాటు చేసి, సినిమాలు తియ్యడం ప్రారంభించిన సంగతిఅందరికీ తెలిసిందే. ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు ‘LGM’ అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా పెద్దగాఆడలేదు, దీంతో ధోని తీస్తే పెద్ద హీరోలతోనేసినిమాలు తియ్యమని తన భార్య కి సూచించాడట. అందులో భాగంగానే గతం లో తమిళ స్టార్హీరో విజయ్ ని కలిసాడు, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నికలిసాడు. రామ్ చరణ్ ని పెట్టి ఒక్క భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా ని నిర్మించడానికిధోని సన్నాహాలు చేస్తున్నాడు అట, ఈచిత్రం 30 భాషల్లో విడుదల కాబోతుందని టాక్. దీనిగురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus