డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే భవదీయుడు భగత్ సింగ్ ఫైనల్ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తెరి రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్ డైరెక్షన్ లో పవన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే హరీష్ శంకర్ పవన్ హీరోగా తెరి రీమేక్ ను తెరకెక్కించాలని భావిస్తున్నట్టు బోగట్టా. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి హరీష్ శంకర్ నుంచి లేదా మైత్రీ నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
రీమేక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి. రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలలో నటించడంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. రీఎంట్రీలో పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేక్ సినిమాలు అనే సంగతి తెలిసిందే. పవన్ తో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ సెట్ కాకపోతే హరీష్ శంకర్ చిరంజీవి లేదా రామ్ తో తర్వాత ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంది.
హరీష్ శంకర్ కెరీర్ లో గ్యాప్ ఎక్కువగా వస్తుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హరీష్ శంకర్ వరుసగా ప్రాజెక్ట్ లను సెట్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.