రాజమండ్రిలో ‘ఆర్.ఎక్స్.100’ భామ ఏం చేస్తున్నట్లు..?

రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్ఎక్స్100’ చిత్రంలో తన గ్లామర్ తో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ప్రేమికుడిని మోసం చేసే యువతిగా… చేసిన కన్నింగ్ పెర్ఫార్మన్స్ కి దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రం తర్వాత ఈమెకు వరుస ఆఫర్లు వస్తుండడం విశేషం. మాస్ మహా రాజ్ రవితేజ హీరోగా వస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది పాయల్. దీంతో పాటూ వెంకటేష్ -నాగ చైతన్య కాంబినేషన్లో తెరెక్కుతున్న ‘వెంకీ మామ’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ.

‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘పవర్’ ‘జై లవ కుశ’ వంటి హిట్స్ ఇచ్చిన బాబీ ‘వెంకీమామ’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా నటిస్తుంది. మరో హీరో నాగచైతన్య రాశి ఖన్నా నటిస్తుంది. ప్రస్తుతం ‘వెంకీమామ’ షూటింగు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పటికే రాశి ఖన్నా షూటింగ్‌లో జాయిన్ కాగా, పాయల్ రాజ్‌పుత్ తాజాగా సెట్స్‌పై వాలింది. ఈ విషయాన్ని స్వయంగా పాయల్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. ‘వెంకీమామ షూటింగులో పాల్గొన్నాను చాలా ఎగ్జైటింగ్‌గా వుంది’ అంటూ ఈ ట్వీట్‌లో పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus