Sara Tendulkar: ఫొటోలు, వీడియోలు చూస్తే… క్లిక్‌ అయ్యేలానే ఉంది!

  • July 29, 2021 / 12:44 PM IST

సినిమా తారల పిల్లలు సినిమాల్లోకి రావడం పెద్ద విషయం కాదు. అలాగే సినిమాల తారల సంతానం క్రికెట్‌లోకి రావడం పెద్ద విశేషం కాదు. కానీ క్రికెటర్ల పిల్లలు సినిమాల్లోకి రావడం… మాత్రం పెద్ద విషయమే. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వార్తను చూస్తే ఇదే నిజమవుతుందా అనిపిస్తోంది. క్రికెట్‌ దేవుడు సచిన్‌ తెందుల్కర్‌ తనయ సారా సినిమాల్లోకి వస్తుంది అంటూ ఓ వార్త బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. సారా అందగత్తె… సినిమా నాయికకు కావాల్సిన హంగులన్నీ ఉన్న అమ్మాయే.

ఈ రెండు అంశాలు పట్టుకునే ఈ వార్తలు రావడం లేదు. ఆమె సోషల్‌ మీడియా పోస్టులు చూసి అనుకుంటున్నారు. సారా సోషల్‌ మీడియా పోజులు చూస్తే… సాధారణ అమ్మాయి చేసే పోస్టులు కనిపిస్తాయి. దాంతోపాటు కథానాయిక అవ్వాలనుకునే అమ్మాయి చేసే పోస్టుల్లానే కనిపిస్తున్నాయి. కాస్త గ్లామరస్‌గా, కుర్రకారును కవ్విస్తున్నట్లుగా ఉన్నాయా ఫొటోస్‌. ప్రస్తుతం సారా వయసు 23. సినిమాల్లోకి రావాలనుకునే వాళ్లకు సరైన వయసు ఇదే అంటుంటారు.

ఇప్పటికే మంచి చదువులు చదువుకున్న సారా… ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తాను అంటే అంజలి – సచిన్‌ ఏమంటారో చూడాలి. మరోవైపు సచిన్‌ తనయుడు అర్జున్‌ ఇప్పటికే క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు సారా కెరీర్‌ ఇటువైపు ఎంచుకుంటుందా అనేది చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus