టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ బ్రో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు వెళుతున్న సాయితేజ్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ వేదికగా జరిగిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో సాయితేజ్ మాట్లాడుతూ ఫ్యాన్స్ అభిమానాన్ని పొందడం కోసమే ఈ ప్రాంతానికి వచ్చానని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు నాకు ఛాన్స్ ఇవ్వడం వల్లే బ్రో సినిమాలో నేను భాగమవ్వడం సాధ్యమైందని సాయితేజ్ వెల్లడించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని ఆయన వెల్లడించారు. పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇంకెక్కడ పెళ్లి బ్రో అని అన్నారు.
ఈ సినిమా ముందు వరకు ఎవరో ఒకరు ట్రై చేసేవారని సాయితేజ్ అన్నారు. బ్రో మూవీ టైటిల్ రిలీజ్ అయిన తర్వాత అందరూ బ్రో అని పిలుస్తున్నారని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయితేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది అని సాయితేజ్ వెల్లడించారు. ఫ్యాన్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని సాయితేజ్ పేర్కొన్నారు.
కొంతసేపటి క్రితం నేను చూశానని ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం లేదని ఆయన కామెంట్లు చేశారు. బైక్ డ్రైవ్ చేసే సమయంలో హెల్మెట్ పెట్టుకోవాలని సాయితేజ్ వెల్లడించడం గమనార్హం. ఫ్యాన్స్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని (Sai Dharam Tej) సాయితేజ్ అన్నారు.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!