Sai Dharam Tej: అప్పుడు ‘సోలో బ్రతుకు’.. ఇప్పుడు ‘రిపబ్లిక్’..!

2020 లో కరోనా కారణంగా లాక్ డౌన్ ఏర్పడడంతో థియేటర్లు మూత పడ్డాయి.9 నెలల వరకు థియేటర్లు తెరుచుకోలేదు. డిసెంబర్ నెలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు లభించినా ముందడుగు వేయడానికి దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు.అయితే మెగా మేనల్లుడు సాయి తేజ్ తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. జనాలు వస్తారా రారా అనే అనుమానాలను పక్కన పెట్టి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్…

జీ స్టూడియోస్ సంస్థ తో కలిసి ఆ చిత్రాన్ని విడుదల చేశారు. జనాలు కూడా బాగానే వచ్చి చూశారు. ఈ చిత్రం స్ఫూర్తితో తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ థియేటర్లు మూతపడ్డాయి.అయితే ఈసారి త్వరగానే తెరుచుకున్నాయి లెండి.కానీ 50 శాతం ఆక్యుపెన్సీతో తమ సినిమాలను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారు.ఎందుకంటే జనాలు కనుక థియేటర్లకు రాకపోతే..ఓటిటిల నుండీ వచ్చే మంచి ఆఫర్లు మిస్ అయిపోతాయని వారు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మళ్ళీ సాయి తేజ్ ముందడుగు వేయడానికి రెడీ అవుతున్నాడని టాక్. దేవ కట్టా డైరెక్షన్లో సాయి తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ మూవీని విడుదల చేయడానికి నిర్మాతలు భగవాన్, పుల్లారావు.. సన్నాహాలు చేస్తున్నారట.అందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసినట్టు వినికిడి. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus