Sai Dharam Tej: త్వరలోనే మిమ్మల్ని కలుస్తా.. సాయి ధరమ్ తేజ్ పోస్ట్!

ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ జరిగి చాలా కాలమవుతున్నా.. ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లోనే ఉండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మెగాఫ్యామిలీ ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో నాగబాబు, వైష్ణవ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై స్పందించారు.

తాజాగా సాయి ధరమ్ తేజ్ నేరుగా పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హాస్పిటల్ లో ఉన్న ఈ మెగాహీరో అక్కడి నుండే ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ”నా మీద, ‘రిపబ్లిక్’ సినిమాపై మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్ అనే పదం చాలా చిన్నది. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను” అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు థంబ్సప్ సింబల్ తో ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో మెగాభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

తేజ్ పెట్టిన ట్వీట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వీడియో బైట్ కూడా రిలీజ్ చేయన్నా’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఆ భగవంతుని దీవెనలు కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus