Pawan Kalyan: పవన్ మూవీ వేరే లెవెల్ అంటున్న సాయిమాధవ్!

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేస్తున్న సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

హరిహర వీరమల్లు పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగా ఉంటుందని సాయిమాధవ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదలయ్యాక మరో లెవెల్ లో ఉంటుందని ఈ సినిమా అత్యద్భుతంగా ఉంటుందని సాయిమాధవ్ బుర్రా వెల్లడించారు. సూర్య ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటామని పవన్, క్రిష్ భావిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ కొత్త కథలను ఎంచుకుంటూ క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus