‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. ఈమె ప్రస్తుతం హీరో శర్వానంద్ సరసన ‘పడి పడి లేచె మనసు’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, విశాల్ శేఖర్ సంగీతాన్ని అందించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుధాకర్ – ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే అన్ని పూర్తి చేసుకొని ఈ సినిమా డిసెంబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రీ షూట్ అంటూ ఒక వార్త బయటికి వచ్చింది.
సినిమా చూసిన తరువాత కొన్ని సీన్లు ఇంకాస్త బాగా రావాలని భావించి ఆ సీన్లని మళ్ళీ రీ షూట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావించగా షూట్ కోసం మళ్ళీ సాయిపల్లవి డేట్స్ అవసరం అవ్వడంతో హీరోయిన్ సాయిపల్లవి డేట్స్ మళ్ళీ కావాలంటే రీ షూట్ కి కూడా డబ్బులు చెల్లించాలని చెప్పడంతో నిర్మాతలు ఆమె చెప్పినదానికి అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ సాయిపల్లవి రీ షూట్ కోసం ఇలా డబ్బులు అడిగే టైప్ కాదంటూ ఆమె పైన వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.