Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘క‌ణం’ సినిమాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను – సాయిప‌ల్ల‌వి

‘క‌ణం’ సినిమాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను – సాయిప‌ల్ల‌వి

  • April 23, 2018 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘క‌ణం’ సినిమాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను – సాయిప‌ల్ల‌వి

నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం ‘కణం’. ఎన్.వి.ఆర్ సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సాయిప‌ల్ల‌వి ఇంట‌ర్వ్యూ….

అమ్మ కోసం చేశాను…Sai Pallavi– ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో `చార్లి` అనే సినిమా చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. త‌ర్వాత ఈ క‌థ‌ను నాకు చెప్పారు. క‌థ విని ముందు నేను న‌టించ‌న‌ని అన్నారు. ఎందుకంటే తెలుగులో కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. నా మాతృభాష త‌మిళంలో నా మొద‌టి సినిమా కావ‌డంతో… తొలి త‌మిళ చిత్రంలోనే త‌ల్లిపాత్ర‌లో ఎందుకు న‌టించాల‌ని వ‌ద్ద‌ని అన్నాను. అయితే స్క్రిప్ట్ చ‌ద‌వి, న‌చ్చితే న‌టించ‌మ‌ని అన్నారు. నేను స్క్రిప్ట్ చ‌ద‌వ‌లేదు కానీ.. మా అమ్మ‌గారు చ‌దివి.. `మంచి క‌థ‌, ఎందుకు చేయ‌న‌ని అన్నావు` అని అడిగింది. `త‌మిళంలో తొలి సినిమా అమ్మ పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు.. హార‌ర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి క‌దా! ఎందుకు చేయాల‌నిపించి చేయ‌లేదు` అని ఆమెతో చెప్పాను. అయితే అమ్మ సినిమాలో న‌టించ‌మ‌ని చెప్ప‌డంతో ఆమె కోసం సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను.

ఆలోచ‌నా విధానం మారింది…Sai Pallavi– న‌టిగా పాత్ర ఏదైనా బావుంటే చేయాలి. సాధార‌ణంగా యంగ్ ఏజ్‌లో ప్రేయ‌సి పాత్ర‌లు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాం. అలాగే ఎవ‌రికైనా రెండు మూడు సినిమాలు చేశాక మన ఆలోచనా విధానం మారుతుంది. అలాగే నా ఆలోచ‌నా విధానం మారుతూ వ‌స్తుంది. ఇక `క‌ణం` సినిమాతో ఆ ఆలోచనా విధానం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను ఓ తల్లిగానే ఊహించుకుంటూ చేశాను. వెరోనికాతో బాగా క‌నెక్ట్ అయ్యాను. ఓ ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నాకు నేను కొత్త‌గా క‌న‌ప‌డుతున్నాను. ఈ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించానా? అన్న అసంతృప్తి మాత్రం అస్సలు లేదు.

ఎంత మంచి పాత్ర చేశామ‌న్న‌దే ముఖ్యం…Sai Pallavi– నేను జార్జియాలో డాక్ట‌ర్ కోర్సు చ‌దువుకున్నాను. నాకు మొటిమ‌లు బాగా వ‌చ్చేవి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా మొటిమ‌లు త‌గ్గ‌లేదు. బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ముఖానికి బ‌ట్ట క‌ట్టుకుని వెళ్లేదాన్ని. నా తొలి చిత్రం ప్రేమ‌మ్ చేసిన‌ప్పుడు నా ముఖం నిండా మొటిమ‌లే. న‌న్ను ప్రేక్ష‌కులు హీరోయిన్‌గా ఒప్పుకుంటారా? అని బాధ‌ప‌డేదాన్ని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక‌.. ప్రేక్ష‌కులు న‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది. ముఖం ఎంత అందంగా ఉంద‌ని కాదు.. ఎంత మంచి పాత్ర చేశామ‌నేదే ముఖ్యం. ఒక‌ప్పుడు మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే అమ్మాయిలు.. ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి కూడా మొటిమ‌లు ఉన్నాయి క‌దా? అని అనుకుంటున్నారు. వాటి గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

పాప‌ను ద‌త్త‌త తీసుకోవాల‌నుకున్నా….Sai Pallavi`క‌రు` సినిమాను త‌మిళంలో ఇప్పుడు `దియా` అని టైటిల్ మార్చారు. త‌ల్లికి, బిడ్డ‌కు మ‌ధ్య మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్‌ను మూవీ. సినిమా చేస్తున్నంత సేపు మూవీకి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను. ఇంత‌కు ముందు చెప్పినట్లు ఇందులో దియా పాత్ర‌లో న‌టించిన వెరోనికాతో ఎమోష‌న‌ల్‌గా బ‌గా క‌నెక్ట్ అయిపోయాను. త‌ల్లి ఇలాగే ఆలోచిస్తుందా? అనిపించేది. ఓ సంద‌ర్భంలో విజ‌య్‌గారి ద‌గ్గ‌ర‌కెళ్లి.. ఆ పాప‌ను ద‌త్త‌త తీసుకోవాల‌నుంద‌ని చెప్పాను. అదే విష‌యం అమ్మ‌కు చెబితే `ముందు నిన్ను నువ్వు చూసుకో… త‌ర్వాత వేరే వారి గురించి ఆలోచించ‌వ‌చ్చు` అని చెప్పింది.

అదెంత నిజ‌మో తెలియ‌దు…Sai Pallavi– నా మాతృభాష త‌మిళ‌మే అయినా, త‌మిళంలో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఒక‌టిన్న‌ర రోజు ప‌ట్టింది. అదే తెలుగులో సగం రోజులోనే డ‌బ్బింగ్ చెప్పేశాను. మాతృభాష త‌మిళం కంటే తెలుగులోనే బాగా మాట్లాడుతాను.. డైలాగ్ చెబుతాన‌ని చాలా మంది అన్నారు. అదెంత నిజ‌మో! తెలియ‌దు కానీ.. తెలుగు కంఫ‌ర్ట్‌గా ఉంది.

నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌ను…Sai Pallavi– నాగశౌర్య‌గారు చాలా మంచి న‌టుడు. త‌ను కెమెరా ముందుకు రాగానే ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ అయిపోతారు. సాధార‌ణంగా షూటింగ్ స‌మ‌యాల్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. నా డైరెక్ట‌ర్స్ బుర్ర తినేస్తాను. ఒక‌వేళ ఏదైనా స‌న్నివేశం స‌మ‌యంలో నాగ‌శౌర్య‌ను చూస్తే.. అత‌ను సైలెంట్‌గా ఉంటే.. అత‌నికి ఇంకా ఎక్కువ స‌మ‌యం కావాలేమోన‌నుకుని నేను సైలెంట్‌గా అయిపోయేదాన్ని. త‌ను నేను మాట్లాడ‌టం లేద‌ని ఫీల‌య్యాడ‌నుకుంటా. నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌ను. ఒక‌వేళ నా వ‌ల్ల ఎవ‌రైనా బాధ ప‌డ్డార‌ని తెలిస్తే … వెంట‌నే సారీ చెప్పేస్తాను. డ‌బ్బింగ్ స‌మ‌యంలో అంద‌రం క‌లిసి డిన్న‌ర్ చేద్దామ‌ని నాగశౌర్య‌కు ఫోన్ చేద్దామ‌నుకుంటే.. అత‌ని వ‌ద్ద ఫోన్ లేద‌ని విజ‌య్‌గారు చెప్పారు. ఆయ‌న మేనేజ‌ర్‌కి కాల్ చేస్తే.. ఆయ‌న `ఛ‌లో` మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పారు. నేను ఆ స‌మ‌యంలో ఎంతో బాధ‌ప‌డ్డాను. నేను ఆయ‌న్ను కావాల‌నే బాధ‌పెట్ట‌లేదు. ఒక‌వేళ నిజంగా బాధ పెట్టి ఉంటే సారీ చెప్పేస్తాను

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanam
  • #Kanam Movie
  • #Kanam Trailer
  • #Naga Shaurya
  • #Sai Pallavi

Also Read

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

related news

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

trending news

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

8 hours ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

8 hours ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

9 hours ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

10 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

10 hours ago

latest news

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

9 hours ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

12 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

1 day ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version