ఫిదా బ్యూటీ సాయి పల్లవితో గొడవ ఎందుకు వస్తుందంటే ?

తమిళ నటి సాయి పల్లవి మొదట తమిళంలో ప్రేమమ్ సినిమా ద్వారా అడుగుపెట్టి అక్కడివారు హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగా హీరో సరసన ఫిదా మూవీ చేసి తెలుగువారికి దగ్గరయింది. తన నటనతో ప్రేక్షకులకు సులువుగా దగ్గరవుతున్నా.. తన ప్రవర్తనతో సినిమా మేకర్స్ కి మాత్రం దూరమవుతోంది. ఎంసీఏ షూటింగ్ సమయంలో నాని ని తెగ చిరాకు పెట్టించిందని టాక్. హీరో ముందుగా స్పాట్ కి వచ్చి సాయి పల్లవికోసం ఎదురుచూసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇక కణం షూటింగ్ సమయంలో నాగ శౌర్య తో గొడవ పడినట్లు స్వయంగా హీరో చెప్పారు. తాజాగా శర్వానంద్‌తో కూడా సాయిపల్లవి గొడవపడిందంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “పడి పడి లేచే మనసు” సినిమాలో శర్వానంద్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం కలకత్తాలో సాగింది. అయితే ఈ షూటింగ్ సమయంలోను శర్వానంద్ తో గొడవపడినట్లు తెలిసింది. ఎందుకు ఫిదా బ్యూటీ అందరితో గొడవ పడుతోందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. పల్లవి తన షాట్ అయిపోయిన వెంటనే నేరుగా కార్ వాన్ లోకి వెళ్లి కూర్చుంటుందని.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదని చెబుతున్నారు. అంతేకాదు.. నటుల పక్కన కుర్చీలో కూర్చునేందుకు సైతం సాయిపల్లవి ఇష్టపడదని.. దీన్ని వారు అవమానంగా భావిస్తున్నారని సమాచారం. సాయి పల్లవి తీరు మార్చుకోకుంటే పరిశ్రమలో కొనసాగడం కష్టమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus